రేపు యథావిధిగా 'PGRS': కలెక్టర్
W.G: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.