కచ్ కంటి సర్పంచిగా కుర్ర దత్తు విజయం

కచ్ కంటి సర్పంచిగా కుర్ర దత్తు విజయం

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కచ్ కంటి గ్రామపంచాయతీ సర్పంచిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కుర్ర దత్తు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజేశ్వర్ పై 506 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన్ను పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంబరాలు జరుపుకున్నారు.