ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

NLG: గుర్రంపోడులోని తెలంగాణ మోడల్ స్కూల్లో మిగిలి ఉన్న ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి. రాగిణి తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీలోగా ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిషన్ కావాల్సిన వారు నేరుగా పాఠశాలకు వచ్చి ధ్రువపత్రాలు సమర్పించాలని వెల్లడించారు.