ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి పొన్నం
HYD: అసెంబ్లీలో ఇందిరా గాంధీ పేరుపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్ప సారాకి ఇందిరమ్మ పేరు పెట్టకండని రాకేష్ రెడ్డి అన్నారు. దీన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీ రికార్డ్స్ నుంచి రాకేష్ రెడ్డి కామెంట్స్ తొలగించాలని, క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.