నిధులు మంజూరు చేయాలని మంత్రికి ఎంపీ వినతి

నిధులు మంజూరు చేయాలని మంత్రికి ఎంపీ వినతి

ఏలూరు: ఎంపీ పుట్టా మహేష్ శనివారం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేశ్‌ను కలుసుకున్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. వేలేరుపాడులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు, నూజివీడు ఐఐఐటీకి రూ.12.17 కోట్లు, ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ. 12.60 కోట్లు మంజూరు చేయాలని మంత్రికి ఎంపీ వినతిపత్రం అందచేశారు.