మున్సిపల్ కమిషనర్ కార్మిక వ్యతిరేక ధోరణి వీడాలి: సీఐటీయూ
గద్వాల మున్సిపల్ కమిషనర్ కార్మిక వ్యతిరేక వైఖరిని విడనాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఉప్పేర్ నరసింహ, వీవీ నరసింహ డిమాండ్ చేశారు. ఇవాళ లింగంబావి వద్ద జరిగిన మున్సిపల్ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అట్టడుగు కులాల కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తే సహించేది లేదని, వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు.