'రంజాన్ పండుగ సోదరభావానికి నిదర్శనం'
BPT: సంతమాగులూరు మండలం కుందుర్తిలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ క్రమశిక్షణ, దాతృత్వం, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన విందులో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.