'కుల వివక్ష వల్లే మత మార్పిడులు'
కరీంనగర్ విశ్వశాంతి హై స్కూల్లో బుధవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. కుల వివక్ష అనే అహంకార ధోరణి వల్లే హిందూ బంధువులు మతం మారుతున్నారని సామాజిక సమరత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సమరత రాష్ట్ర మహిళా ప్రముఖ్ కారెడ్ల రుక్మిణి పాల్గొన్నారు. సమరతతోనే హిందూ సమాజం బలోపేతమవుతుందని నేతలు పిలుపునిచ్చారు.