20 ఏళ్లకే కౌన్సిలర్‌గా ఎన్నికైనా యువతి

20 ఏళ్లకే కౌన్సిలర్‌గా ఎన్నికైనా యువతి

ఖమ్మం: రాజకీయాల్లో రాణించడానికి వయసు అడ్డంకి కాదని ఎదులాపురం మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయి. 19వ వార్డు నుంచి పోటీ చేసిన మల్లాది శిరీష కేవలం 20 ఏళ్లకే కౌన్సిలర్‌గా గెలుపొంది, జిల్లాలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. యువతరం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని చాటిచెబుతూ శిరీష సాధించిన ఈ విజయంపై పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.