గంగాపూర్‌లో మార్కెట్‌ను సందర్శించిన ఏఎంసీ చైర్మన్
SDPT: చిన్నకోడూరు మండలం గంగాపూర్ లోని మిర్చి మార్కెట్ ను ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ గురువారం పాలకవర్గ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో మార్కెట్ యార్డ్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న టాయిలెట్స్ పూర్తి చేసేలా, తాగునీటి సౌకర్యం కల్పించేలా కృషి చేస్తామన్నారు.