నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో ఉద్యోగులు తమ విధుల పట్ల నిజాయితీ చాటుకున్నారు. దేవరకొండ నుంచి బయలుదేరిన హైదరాబాద్ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు రూ.1,10,000 విలువైన ఐఫోన్ ను బస్సులో మర్చిపోయి కర్మన్ ఘట్‌లో దిగిపోయింది. కండక్టర్ వనం యాదగిరి, డ్రైవర్ మహమూద్ అలీ ఫోన్‌ను గమనించి డిపో అధికారులకు తెలియజేశారు. విచారణ జరిపి ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో అందజేశారు.