నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యునికి పితృవియోగం
MHBD: జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి లచ్చనాయక్ మంగళవారం ఉదయం మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు. లచ్చనాయక్ అంత్యక్రియలు సాయంత్రం గూడూరు మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల జిల్లా పరిధిలోని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.