వైభవంగా మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

వైభవంగా మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ బహుళ షష్టని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గురువారం ఉప కమిషనర్ ఆలయ ఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో వేద పండితులు వేదమంత్రాలు చదువుతూ.. మంగళ వాయిద్యాలు నడుమ కళ్యాణం జరిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.