నేడు కడెం ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి

NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కడెం ప్రాజెక్టును సందర్శించనున్నారని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, కలెక్టర్‌తో కలిసి మంత్రి కృష్ణారావు ప్రాజెక్టును సందర్శించి వరద పరిస్థితి కూడా సమీక్షిస్తారన్నారు.