ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల అరెస్ట్
గుంటూరులో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాపేట పీఎస్ పరిధిలో 11 మంది, పాత గుంటూరులో నలుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.2 లక్షల నగదు, 13 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యువత బెట్టింగ్‌ల ఉచ్చులో పడి నష్టపోవద్దని సూచించారు.