VIDEO: చెరువులో ఇరుక్కున్న ఏనుగు

CTR: బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లో ఏనుగులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉదయం బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలోని గొనివారి చెరువులో రెండు ఏనుగులను స్థానికులు గుర్తించారు. నీటిలో సేద తీరుతున్న క్రమంలో ఓ గజరాజు బురదలో చిక్కుకున్న ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.