జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చినా ఓడిపోయారు: వివేక్
TG: మాజీమంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై మంత్రి గడ్డం వివేక్ స్పందించారు. 'జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. 40 ఏళ్లు కాంగ్రెస్‌లో అన్ని పదవులు అనుభవించారు. ఒక్క ఏడాది లేకపోతేనే ఇంత అక్కసు వెళ్లగక్కారు. ఇచ్చిన గౌరవాన్ని ఆయన నిలుపుకోలేకపోయారు' అని విమర్శించారు.