'కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు'

'కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు'

MNCL: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతుందని జన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. జన్నారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, నాయకులు ముజఫర్ ఖాన్ ఉన్నారు.