సర్పంచ్ ఎన్నికలు.. తట్టేపల్లి క్లస్టర్ AROగా ఆనంద్
VKB: పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి, బండమీదిపల్లి, సిద్ధన్న మడుగు తండా గ్రామాలను కలిపి తట్టేపల్లి క్లస్టర్ ఏర్పాటు చేశారు. తట్టేపల్లి క్లస్టర్‌కు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ నియమితులయ్యారు. ఆయా గ్రామాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తట్టేపల్లిలో నామినేషన్ దాఖలు చేయాలని అధికారులు సూచించారు.