విద్యుదాఘాతంతో రైతు మృతి

SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో రైతు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎల్కల్ గ్రామానికి చెందిన పిట్ల కృష్ణ (40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు బోరు మోటర్ వైర్లు సరి చేయడం కోసం వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.