VIDEO: రాజమండ్రిలో 'పేరెంట్ అండ్ చైల్డ్ వాక్' కార్యక్రమం

E.G: రాజమండ్రిలో తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్ల మధ్య బంధాలు బలోపేతం చేసేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు 'పేరెంట్ అండ్ చైల్డ్ వాక్' ఆదివారం కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో భాగంగా హ్యాపీ స్ట్రీట్‌లో ఒకే రంగు దుస్తులు ధరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 80 ఏళ్ల వృద్ధుడు తన 45 ఏళ్ల కొడుకుతో కలిసి నడవడం పలువురికి స్ఫూర్తినిచ్చింది.