నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
SKLM: గార మండలం చల్లపేట విద్యుత్ ఉప కేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి. యోగేశ్వరరావు బుధవారం తెలిపారు. అంపోలు, శ్రీకూర్మం, రామచంద్రాపురం, వాడడ పంచాయతీల పరిధిలో పలు గ్రామాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.