జిల్లాలో భారీగా పెరిగిన చికెన్ ధరలు
VKB: జిల్లాలో చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడంతో వికారాబాద్ మార్కెట్‌లో కిలో చికెన్ ధర ఏకంగా రూ.350కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం, దాణా ఖర్చులు భారం కావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.