మహిళల జట్టు చరిత్ర సృష్టించింది: రాష్ట్రపతి

మహిళల జట్టు చరిత్ర సృష్టించింది: రాష్ట్రపతి

మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 'తొలిసారి కప్పు గెలుచుకోవడంతో చరిత్ర సృష్టించారు. మహిళల కష్టానికి తగిన ఫలితం వచ్చింది. ఈ విజయం మహిళల క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. అమ్మాయిలు.. దేశం గర్వించేలా చేసిన తీరును అభినందిస్తున్నా' అని పేర్కొన్నారు.