బురదలో కూరుకుపోయి మాపై విమర్శలా?: వెంకటరామిరెడ్డి

బురదలో కూరుకుపోయి మాపై విమర్శలా?: వెంకటరామిరెడ్డి

ATP: 'అవినీతి బురదలో కూరుకుపోయి, దాన్ని అందరికీ అంటించాలని చూస్తున్నారా?' అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దౌర్జన్యాలు, భూ ఆక్రమణలపై ప్రశ్నిస్తే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, తమ కుటుంబ చరిత్ర తెరిచిన పుస్తకమని అన్నారు.