VIDEO: 'BRS నేతలకు రాజ్యాంగం అంటే విలువ లేదు'

HNK: బీఆర్ఎస్ నేతలకు రాజ్యాంగం అంటే విలువ లేదని గవర్నర్ అంటే గౌరవం లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో స్పీకర్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే నాయిని కాంగ్రెస్ నేతలతో కలిసి హన్మకొండలో నిరసనకు దిగారు. అనంతరం కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు.