టీవీకే నేతపై రజనీకాంత్ ఫైర్
టీవీకే పార్టీ నేత ఆదవ్ అర్జున చేసిన ఆరోపణలపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలు అసత్యమని తెలిపారు. కాలం మాట్లాడకపోవచ్చు కానీ, సరైన సమయంలో సమాధానం ఇస్తుందని అన్నారు. అలాగే, తనకు మద్దతుగా నిలిచినవారికి రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రాకుండా డీఎంకే పార్టీ బెదిరించిందని ఆదవ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.