VIDEO: చిరుతపులి దాడిలో ఆవు మృతి

VIDEO: చిరుతపులి దాడిలో ఆవు మృతి

ADB: చిరుతపులి దాడిలో ఒక ఆవు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం సాత్ మెరి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన మేస్రం బొజ్జు బుధవారం తెల్లవారుజామున తన పొలంలో కట్టేసిన పశువులను రక్షించుకునే ప్రయత్నంలో ఉండగా, చిరుతపులి ఆవుపై దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనను మేస్రం బొజ్జు, మేస్రం గణపతి, స్థానికులు ధృవీకరించారు.