VIDEO: తణుకులో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు

VIDEO: తణుకులో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు

W.G: తణుకు పట్టణ పరిధిలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తణుకు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు నరసాపురం నుంచి ఏలూరు వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.