గెలివి కరుణాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే నివాళులు
SS: ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామానికి చెందిన గెలివి కరుణాకర్ రెడ్డి మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. కరుణాకర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.