జిల్లాలో వార్డుల పునర్విభజన గడువు పొడిగింపు

జిల్లాలో వార్డుల పునర్విభజన గడువు పొడిగింపు

KKD:కాకినాడ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీల వార్డుల పునర్విభజన గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాలు ప్రస్తుతం జనగణన విధుల్లో నిమగ్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేయడానికి ఈ నెల 26 వరకు గడువును అధికారులు పొడిగించారు.