'బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం'

'బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం'

VSP: బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 ప్రకారం దేవాలయాలు, ఇతర ప్రదేశాల్లో బాల్య వివాహాలు నిర్వహించడం నేరమని ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ తెలిపారు. పూర్ణా మార్కెట్ టర్నర్ చౌట్రీ కార్యాలయంలో కొత్త కార్యవర్గంతో గురువారం ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలపై రూపొందిన పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రతి ఆలయంలో దీన్ని అమలు పరచాలని సూచించారు.