"అన్నీ మేమే చూసుకుంటాం అన్నా తప్పక రావాలి"
SRCL: గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు ఇల్లిల్లు తిరుగుతూ అమ్మ, అక్క, బాపు మీ ఓటు వేసి నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. "అన్నా తప్పక రావాలి..", "అక్కా నీ ఓటు చాలా ముఖ్యం" అంటూ ఉద్యోగాలకు పట్టణాలకు వెళ్ళినవారికి ఫోన్లు చేస్తున్నారు. "మీ బస్ ఛార్జీలు, ఇతర ప్రయాణ ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం" అని ఆర్థికపరమైన హామీలు కూడా ఇస్తున్నారు.