జీపీఓపై దాడి హేయం.. కలెక్టర్‌కు వినతి
MDK: కౌడిపల్లి మండలం కుషాన్ గడ్డ తండా జీపీఓ భూపాల్పై జరిగిన దాడిని జిల్లా జీపీఓల కమిటీ ఖండించింది. బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ కలెక్టర్ ప్రతిమ సింగ్‌ను శుక్రవారం వినతిపత్రం అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు రక్షణ కల్పించాలని వారు విన్నవించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించేది లేదని కలెక్టర్ అన్నారు.