మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన వసంత

NTR: మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబును మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం పరామర్శించారు. రమేష్ బాబు మాతృమూర్తి విమలాదేవి (92) ఇటీవల మృతిచెందారు. శనివారం జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లి విమలాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.