'పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి'

'పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి'

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈనెల 11 నుంచి నేటి వరకు నిర్వహించిన ఎన్నికలను అధికారులు, సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు. ఎన్నికలకు సహకరించిన అభ్యర్థులు, ప్రజలు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు సీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.