మహిళలకు రక్షణ లేదు: మాజీ ఎమ్మెల్యే

KDP: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దవారిపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయన్నారు. ఈ మేరకు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కాగా, వీరిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.