రోడ్డు ప్రమాదంలో బయటపడ్డ ఆవుల అక్రమ రవాణా
E.G: నిడదవోలు మండలం కోరుమామిడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్ బైకును ఢీ కొట్టింది. గాయపడిన వారిని స్థానికులు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత వ్యాన్‌లో సుమారు 15 ఆవులను కాళ్లు కట్టేసి, వాటి పైన టైర్లు అమర్చి అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.