యూరియా కోసం రైతుల తిప్పలు

SRD: చౌటకూరు మండలంలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. అరకొరగా వచ్చిన యూరియాను తీసుకునేందుకు రైతులు ఎగబడుతున్నారు. రెండు బస్తాల యూరియా పొందడానికి తెల్లవారుజామున నుంచి క్యూలైన్లో నిలబడి నిరీక్షిస్తున్నారు. మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో శుక్రవారం ఒక లోడ్ యూరియా బస్తాలు రాగా, విషయం తెలుసుకున్న రైతులు, అందరూ ఒకేసారి రావడంతో తోసుకున్నారు.