'విద్యుత్ సరఫరాకు కృషి చేస్తా'

'విద్యుత్ సరఫరాకు కృషి చేస్తా'

ADB: ఆదివాసీ రైతులకు విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం ఉట్నూరులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. సాత్నాల మండలం జాంని గ్రామానికి చెందిన 28 మంది రైతుల డీడీలు పూర్తికావడంతో వారికి కరెంటు సరఫరాలో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.