'నా దౌర్జన్యం రుజువైతే రాజీనామా చేస్తా'

NDL: స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నా పై వచ్చిన ఆరోపణలు నిర్ధారిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. చర్చకు నేను సిద్ధం" అంటూ సవాల్ విసిరారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తన పని చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.