ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.