కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

MDK: రామాయంపేట మండల కేంద్రంలో మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు గజవాడ నాగరాజు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ప్రారంభించారు. ఎండల వేడి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం తన సొంత ఖర్చులతో గజవాడ నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ప్రజలకు స్వచ్ఛమైన చల్లటి త్రాగునీరు అందిస్తానని తెలిపారు.