నేడు 'మావోయిస్టు రహిత భారత్'పై చర్చ
మావోయిస్టు రహిత భారత్ అంశంపై ఈరోజు లోక్‌సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఈ చర్చను ప్రారంభించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, భద్రతా చర్యలపై సభలో చర్చించనున్నారు. కాగా, 'ఆపరేషన్ కగార్' గడువు రేపటితో ముగియనుండటంతో ఈ చర్చకు ప్రాధాన్యత సంతరించుకుంది.