'విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి'

'విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి'

అన్నమయ్య: రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని DY, DEO అధికారి లోకేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం మదనపల్లెలోని కోసువారిపల్లి జడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒత్తిడికి లోనుకాకుండా పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.