నామినేషన్ కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద సందర్శించి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆమె ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని, ప్రశాంతంగా సాగేందుకు కృషి చేయాలన్నారు.