VIDEO: చెత్తకు నిప్పు.. పర్యావరణానికి ముప్పు
HYD: పోచారం మున్సిపాలిటీ ప్రతాపసింగారంలో ప్రతి రాత్రి జరుగుతున్న చెత్త దహనం స్థానికులను కలవర పెడుతోంది. ఘట్‌కేసర్ మార్గంలో నడుస్తున్న చెత్త సేకరణ యార్డ్ వద్ద ప్లాస్టిక్ సహా విషపదార్థాలను రహదారి పక్కనే కాల్చేస్తున్నారు. దాంతో దుర్వాసనలు, విష వాయువులు వాతావరణంలోకి వ్యాపించి ప్రజా ఆరోగ్యానికే ప్రమాదంగా మారుతున్నాయని నివాసితులు ఆగ్రహిస్తున్నారు.