జగిత్యాలలో వ్యక్తి దారుణ హత్య

జగిత్యాలలో వ్యక్తి దారుణ హత్య

JGL: మల్లాపూర్ మండలం వెంపలికి చెందిన సకినపల్లి కామీ (62) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద కుమారుడి ఇంట్లో భోజనం చేసిన కామీ, చిన్న కుమారుడి ఇంటికి నిద్రించేందుకు వెళ్తుండగా, వీధిలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పాత కక్షలా? భూ వివాదమా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.