గరుడ వాహనంపై విహరించిన శ్రీవారు

TPT: గూడూరు పట్టణం రాజావీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి 27వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై విహరించారు. ఈనెల 5వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.