జనవిజ్ఞాన వేదిక నూతన కమిటీ ఎన్నిక

KDP: ప్రొద్దుటూరు జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో సోమవారం పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా వేంపల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా నంగా రాజేశ్, కోశాధికారిగా డాక్టర్ చక్రధర్, ఉపాధ్యక్షులుగా ఉషారాణి, ఈశ్వరయ్య, డాక్టర్ దస్తగిరి, ప్రసన్నకుమార్, హేమంత్, గఫార్, సమత కన్వీనర్‌గా రాజ్యలక్ష్మీలను ఎన్నుకున్నారు.